జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరవేయాలి: ఎమ్మార్పీఎస్

జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరవేయాలి: ఎమ్మార్పీఎస్ 
ఆదోని, జూలై 5: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు   ఆదోని నియోజకవర్గంలోని అమరావతి నగర్‌లో ఆదివారం "గో టు విలేజ్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కర్నూలు జిల్లా ఇన్‌చార్జిలు దుమ్ము చిన్న వెంకటేశ్వర్లు మాదిగ, పులిగొట్ల గోపి మాదిగ సూచనలతో ఆదోని ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ అధ్యక్షత వహించగా, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బండారి హనుమంతు మాదిగ, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జి బండారి గిడ్డయ్య పాల్గొని మాట్లాడారు.జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండాలను ఆవిష్కరించి ఉద్యమ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఉద్యమం స్థాపించి 32 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో వర్గీకరణ సాధన కోసం సాగిన పోరాటాలను ప్రజలకు వివరించి, ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరూ జెండా ఆవిష్కరణలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో చిన్న కుమార్ మాదిగ, వన్నెల నాగేష్ మాదిగ, చిరు మాదిగ, వన్నెల సాయి మాదిగ, మల్లేష్, శంకర్, ఈరమ్మ, లక్ష్మీ, శంకరమ్మ, శకుంతలతో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 #SBNews #MRPS #MandakrishnaMadiga #GoToVillage #Adoni #Kurnool #AmaravathiNagar #MRPS32ndFormationDay #TeluguNews #SocialJustice #Madiga #July7 #MRPSFlag #AndhraPradesh

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు