Movement for Peace and Justice (MPJ) –ఇల్లందు ఆధ్వర్యంలో నెం.2 బస్తీ, పాత శాంతినికేతన్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ఫారం ఫిల్లింగ్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ప్రజలు పాల్గొని తమ ఎస్‌ఐఆర్ ఫారాలను నింపారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన ఓటరు ఎన్నికల జాబితాలో తమ పేరు సక్రమంగా నమోదు చేసుకోవాలని MPJ ప్రతినిధులు సూచించారు. ఉచితంగా సేవలు అందించినందుకు స్థానికులు సంస్థను అభినందించారు.ఈ కార్యక్రమంలో యాకూబ్ ఆలం, సమద్, షాకిర్ తదితర కార్యకర్తలు పాల్గొని ప్రజలకు ఫారాలు నింపడంలో సహకరించారు.
#SBNews #Yellandu #MPJ #SIR #VoterList #SpecialIntensiveRevision #ElectionCommission #VoterRegistration #Telangana #Democracy #ElectionUpdate #BhadradriKothagudem #TeluguNews #VotingRights #PublicAwareness
0 కామెంట్‌లు