సింగరేణి, జూలై 7 (ఎస్‌బీ న్యూస్): సింగరేణి పరిధిలోని భాగ్యనగర్ తండాలో బంజారా సంప్రదాయాల ప్రకారం సీతల పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని సీతల మాతను ప్రత్యేకంగా మహిళలు పూజించారు.ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ సీతల పండుగ బంజారా అస్తిత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, భాషను భావితరాలకు అందించడం ప్రతి లంబాడి కుటుంబ బాధ్యత అని అన్నారు. ఈ పండుగ వెనుక చారిత్రక, సామాజిక, ఆరోగ్యపరమైన విలువలు దాగి ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ తండాకు చెందిన మహిళలు, యువత, పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయ పూజలు నిర్వహించి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
0 కామెంట్‌లు