ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన కుటుంబానికి రేగా విష్ణు మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సాయం
పినపాక, జూలై 7 (ఎస్‌బీ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీకి చెందిన ఇర్ప వెంకటేశ్వర్లు (37) (నారాయణ కుమారుడు) ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా brs అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. రేగా విష్ణు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబానికి దశదినకర్మల నిర్వహణ కోసం ఆర్థిక సహాయం ను మల్లారం గ్రామ సర్పంచ్ ఇర్ప సాంబశివరావు, ఉపసర్పంచ్ కొమరం రాధాబాయి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం నారాయణ, ఇర్ప రామనాథం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుదిగొండ రామకృష్ణ, దాట్ల మోహన్‌రావు, కోడిరెక్కల రమేష్, జాడి కన్నయ్య, నల్ల సిల్వరి, కొమరం నరేష్, ఊసం ఆదినారాయణతో పాటు పలువురు గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#SBNews #Pinapaka #Mallaram #BhadradriKothagudem #RegaKanthaRao #RegaVishnuMemorialFoundation #TelanganaNews #LocalNews #TeluguNews #HelpingHands
0 కామెంట్‌లు