ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు
– ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని సీతారామపురం సర్పంచ్ అనిత విజ్ఞప్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇనప విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి ఒరిగిపోయాయి. ప్రస్తుతం అవి కేవలం విద్యుత్ తీగల ఆధారంగా నిలిచి ఉండటంతో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే పెంటన్నగూడెం గ్రామంలో విద్యుత్ కేబుల్ కిందకు వేలాడుతూ చేతికి అందేంత ఎత్తులో ఉండటంతో చిన్నారులు, పాదచారులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు.ఈ సమస్యలపై స్పందించిన సీతారాంపురం గ్రామ సర్పంచ్ అనిత, ప్రమాదాలు జరిగే ముందు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిపోయిన స్తంభాలను మార్చడంతో పాటు వేలాడుతున్న విద్యుత్ కేబుల్‌ను సరిచేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.
#SBNews #Pinapaka #Seetharampuram #Pentanagudem #Electricity #PowerSafety #BhadradriKothagudem #TelanganaNews #LocalNews #BreakingNews #TeluguNews
0 కామెంట్‌లు