ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో పామాయిల్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి: పగడాల సతీష్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం మండలాల రైతుల ప్రయోజనార్థం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో పామాయిల్ పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పినపాక మండలంలోని దుగినేపల్లి, చేగర్శల, టి.కొత్తగూడెం, జానంపేట, భూపతిరావుపేట, పాండురంగాపురం, సింగిరెడ్డిపల్లి, గడ్డంపల్లి, ఏడూళ్లబయ్యారం, పినపాక గ్రామాలతో పాటు కరకగూడెం మండలంలోని అనంతారం, పద్మాపురం, మోతె, కరకగూడెం, భట్టుపల్లి గ్రామాల్లో పెద్దఎత్తున పామాయిల్ సాగు జరుగుతోందన్నారు.ప్రస్తుతం రైతులు తమ పంటను విక్రయించేందుకు అశ్వారావుపేట వరకు తరలించాల్సి రావడం వల్ల రవాణా ఖర్చులు అధికమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో పామాయిల్ సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో పామాయిల్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సమావేశంలో పినపాక మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, పీఏసీఎస్ చైర్మన్ ఎం. రవివర్మ, బీఆర్ఎస్ మండల నాయకులు పొనుగోటి భద్రయ్య, పోలిశెట్టి సత్తిబాబు, జి. రామకృష్ణ, వై. చెన్నకేశవులు, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, రాయల బాబు, బుల్లిబాబు, కొండేరు నాగభూషణం, నాసర్ రెడ్డి, సుగ్యాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు