నేడు గుండాల మండలంలో పర్యటించనున్న కల్వకుంట్ల కవిత

నేడు గుండాల మండలంలో పర్యటించనున్న  కల్వకుంట్ల కవిత

చాట్ల వనజ కుటుంబ పరామర్శతో పాటు పోడు రైతులకు సంఘీభావం

గుండాల మండలం జులై 9 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

 గుండాల మండలం శంభునిగూడెంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన చాట్ల వనజ కుటుంబాన్ని ఆమె
పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులు ట్రెంచ్లు తవ్విన పోడు భూములను కవిత పరిశీలించనున్నారు. ట్రెంచ్ల కారణంగా సాగు పనులకు ఆటంకం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోడు రైతు కుటుంబాలతో ఆమె సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. పోడు రైతులకు సంఘీభావంగా కవిత స్వయంగా పోడు భూముల్లో నాగలి కట్టి ఏరువాక దున్ననున్నారు. రైతుల సాగు హక్కులను పరిరక్షించాలని, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కవిత పర్యటన నేపథ్యంలో శంభునిగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు