నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని టీజీఎస్‌ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను రూ.1.50 కోట్ల వ్యయంతో ఆధునికీకరించే పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి , ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి హాజరై శంకుస్థాపన చేశారు. త్వరలో బస్‌స్టేషన్‌లో విశాలమైన వెయిటింగ్ హాల్, డిజిటల్ ప్రయాణికుల సమాచార వ్యవస్థ, వాహనాల పార్కింగ్ సౌకర్యం, స్వచ్ఛమైన తాగునీటి వసతి, ఆధునిక మరుగుదొడ్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్‌స్టేషన్లను ఆధునికీకరించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు
0 కామెంట్‌లు