చింతిర్యాల పంచాయతీ భవనం ప్రారంభోత్సవంపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు నిరాధారం: యూత్ కాంగ్రెస్
అశ్వాపురం మండలం చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవంపై బీఆర్‌ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని అశ్వాపురం మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు. కార్యక్రమ షెడ్యూల్‌ను అధికారులు ముందుగానే ప్రకటించి సమాచారం అందించారని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేక కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరడం సరికాదని, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ అధికారులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారమే నిర్వహించారని పేర్కొన్నారు.
0 కామెంట్‌లు