చదువుకున్నవాళ్లు వేలిముద్ర ఎలా పెడతారు? మాలాంటి అమాయక గిరిజనులతో ఆడుకుంటారా - బోటుగూడెం ఉపసర్పంచ్ ధనలక్ష్మి ఆవేదన


- 190 అప్లికేషన్లు ఎలా అయ్యాయి? 
- లిస్టులో లేని కొత్త పేర్లు ఎలా వచ్చాయి
- ఎమ్మెల్యే కు సైతం సమస్యను వివరించాం
- మా భూముల్లోకి మేము రావడం తప్పా

అటవీశాఖ అధికారులు మేము సాగు చేసుకుంటున్నా భూములు సాగులో లేవంటూ ఐటీడీఏలో తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్లే మాకు ఈ సమస్యలు వచ్చాయని బోటుగూడెం ఉపసర్పంచ్, పోడు రైతు ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ లో ఉన్నవారు చదువుకున్న వారు అయినప్పటికీ పంపిన లిస్టులో వేలిముద్రలు ఉన్నాయని చదువుకున్న వారు వేలిముద్రలు ఎలా వేస్తారు అంటూ ఆమె ప్రశ్నించారు. అప్పుడు సెక్రటరీగా ఉన్న జ్యోతి, అటవీ హక్కుల చైర్మన్ పంపిన రిపోర్టులో ఏముందో తమకు తెలియదు అన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి సైతం నిన్న, ఈరోజు తీసుకుని వెళ్లామని చెప్పారు. ఎమ్మెల్యే సైతం తమ ఆవేదన విని అటవీ శాఖ అధికారులతో సైతం మాట్లాడారని తెలిపారు. అక్కడి నుండి ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఇక్కడ అధికారులు ఎవరు ఫోన్ ఎత్తలేదని ఆమె తెలిపారు. ఆ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని అది పోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు దయవుంచి మా భూములు మాకు ఇప్పించాలని వేడుకున్నారు. కొత్తగా అటవీ భూములకు వెళితే కేసులు నమోదు చేయండి అంటూ తెలిపారు. అడవిలో నమ్ముకుని జీవనం సాగించే ఆదివాసులమై నేడు ఆవేదన వ్యక్తం చేయాల్సి వస్తుందని తెలిపారు. తమ గ్రామపంచాయతీ బోటుగూడెంలో లో 120 అప్లికేషన్లు ఉంటే 190 అప్లికేషన్లు ఎలా అయ్యాయి అంటూ ప్రశ్నించారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు