భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పినపాక మండలం తోగ్గుడెం గ్రామ సర్పంచ్ పూనెం వెంకటేశ్వర్లు గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ (జేసీ)కి వినతిపత్రం అందజేశారు.వినతిపత్రంలో తోగ్గుడెం గ్రామ రేషన్ షాప్ ఏర్పాటు, గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, తోగ్గుడెం–మారేడుబాక చెరువు వరకు ఆర్/బీ రోడ్డు, టేకులగూడెం–పెద్దవాగు వరకు ఆర్/బీ రోడ్డు, కోళ్ల ఫారం నుంచి మారేడుబాక చెరువు వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం, అలాగే అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలని కోరారు.వినతిని స్వీకరించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన సర్పంచ్ పూనెం వెంకటేశ్వర్లు జేసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 3వ వార్డు సభ్యురాలు జర సుశీల, 4వ వార్డు సభ్యుడు చిర్ర ఉప్పలయ్య, కాంగ్రెస్ నాయకులు చిట్టిమల్ల సతీశ్, పాయం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు