మేము ఎంతో కాలంగా సాగు చేశామంటూ స్థానిక గిరిజనులు అడ్డుపడుతున్నారు
ఎక్కడ మీడియాను అవమానపరచలేదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బోటుగూడెం గ్రామపంచాయతీ బందగిరి నగరం గ్రామం సమీపంలో గల అటవీ భూమిలో గతంలోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ట్రంచ్ పనులు పూర్తి చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్నేహలత తెలిపారు. సోమవారం ఆమె అటవీ భూమి వద్ద అటవీ శాఖ అధికారులతో కలిసి మాట్లాడుతూ మొక్కలు వేసే ప్రయత్నానికి అటవీ శాఖ అధికారులు వెళ్ళగా ఆ భూమిని సాగు చేసుకుని బతుకుతున్నాం మా భూములు మాకు ఇవ్వండని స్థానిక గిరిజనులు పోడు రైతులు అడిగిన మాట నిజమేనని కానీ ట్రంచ్ కొట్టిన భూములు రావని వారికి తేల్చి చెప్పామని ఆమె తెలిపారు. ఈ విషయంలో తమ భూములు పోతున్నామని ఆవేదనతో పోడు రైతులు తమ ఆవేదనను తమపై వెల్లబుచ్చారని ఆమె తెలిపారు. ఈ విషయమై వారు స్థానిక ఎమ్మెల్యేని సైతం కలిసినట్లుగా ఆమె దృష్టికి వచ్చినట్లు చెప్పారు. వారి వద్ద ఎటువంటి ఆధారాలున్న ఆ భూమిని వదిలేస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము అటవీ భూముల రక్షణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. అనంతరం ఆమె మీడియాపై దురుసుగా ప్రవర్తించారని వైరల్ కావడంతో ఆ విషయం పై ప్రస్తావించగా అటువంటి విషయం జరగలేదని స్పష్టం చేశారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై తమకు గౌరవం ఉందన్నారు. మీడియా రావడం చూసి అక్కడికి చేరుకున్న రైతులు తమకు న్యాయం జరుగుతుందేమోనని దృష్టితో కాస్త ఆలజడి సృష్టించారని తెలిపారు. ఆ కారణం చేతనే మీడియాను కాస్త వెళ్ళమని చెప్పామని ఆమె మీడియా ముఖంగా తెలియజేశారు. అటవీ భూముల్లో వస్తే కాదు అటవీ భూములను ఆక్రమించే వారికి సహకరిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీ హక్కు చట్టం ప్రకారమే మాట్లాడమని తెలిపారు. మీడియాను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు.
0 కామెంట్‌లు