పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణ కోసం వెళ్లిన జర్నలిస్టులను "ఇక్కడికి రావద్దు" అంటూ అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం సరైన విధానం కాదని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్‌లో సమావేశమైన పాత్రికేయులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత అన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై ఆంక్షలు విధించడం, కేసులు నమోదు చేస్తామనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
అటవీ ప్రాంతాల్లో మీడియా ప్రవేశంపై ప్రభుత్వం లేదా సంబంధిత శాఖ చట్టపరమైన నిబంధనలు జారీ చేస్తే వాటికి అనుగుణంగానే వ్యవహరిస్తామన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పినపాక మండల పాత్రికేయులు కోరారు.
0 కామెంట్‌లు