మంత్రుల పర్యటన రద్దును కూడా రాజకీయంగా చూడటం సరికాదు: పేరం వెంకటేశ్వర్లు


మంత్రుల పర్యటన రద్దు అయిన విషయాన్ని కూడా రాజకీయంగా చూడటం బీఆర్ఎస్ నాయకులకు తగదని కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పేరం వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రద్దుకు అనేక కారణాలు ఉండవచ్చని, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం సరైంది కాదన్నారు. మీ పార్టీ నాయకుల పర్యటనలు ఎప్పుడూ రద్దు కాలేదా అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని చెప్పారు. ఆ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, దానిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, అనవసర విమర్శలు చేయకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజల మధ్య ఉండి వారి నమ్మకాన్ని తిరిగి పొందేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకుని నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి, దిశా కమిటీ అధ్యక్షులు  మద్దెల సమ్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిట్టిమల్ల ప్రసాదు,ఉప సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి  కోడం రాంమోహన్, గ్రామ పంచాయతీల సర్పంచులు ఈసంభవతి  , స్వప్న, ఉమామహేశ్వరి, మట్ట బాబురావు, వాగబోయిన చందర్రావు, నాగ కుమారి, సుమలత, ఉప సర్పంచ్ నిట్ట శిరీష, రావిళ్ళ నర్సమ్మ,  మండల నాయకులు ఉడుముల లక్ష్మీ రెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి,బండారు సాంబ, హేమంత్ రెడ్డి,  మాజీ సర్పంచ్ కళ్యాణి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు