సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా.. డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి

సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా.. డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి
అఖిల భారత అంగన్వాడి డిమాండ్స్ డే సందర్భంగా 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సిడిపిఓ కార్యాలయం ఎదుట శుక్రవారం అంగన్వాడి టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని, పెన్షన్, సీపీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు అందించాలని, కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించాలని అంగన్వాడీ సిబ్బంది  డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, బీఎల్ఓ వంటి అదనపు విధులను రద్దు చేయాలని, ఐసీడీఎస్‌కు తగిన నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు. పదవీ విరమణ చేసిన అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టం ప్రకారం రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించడంతో పాటు నూతన విద్యా విధానాన్ని అంగన్వాడి కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


మణుగూరు అంగన్వాడి ధర్నా, సిడిపిఓ కార్యాలయం, అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లు, ఐసీడీఎస్, భద్రాద్రి కొత్తగూడెం వార్తలు, తెలంగాణ అంగన్వాడి


#Manuguru #Anganwadi #ICDS #Telangana #BhadradriKothagudem #CDPO #Protest #TeluguNews #SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు