యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న త్రివేణి పాఠశాల విద్యార్థిని
ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాల విద్యార్థిని ఎం. శ్రీలక్ష్మీ ప్రసన్న ప్రతిష్ఠాత్మక యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచిందని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపుడి వీరేంద్ర చౌదరి తెలిపారు.పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, స్వర మధురిమ కల్చరల్స్, ఖమ్మం ఆధ్వర్యంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన "క్లాసికల్ నైట్ ఇన్ మన ఖమ్మం" కార్యక్రమంలో 125 మంది భరతనాట్యం, కూచిపూడి నర్తకులు 30 నిమిషాల పాటు నిరవధికంగా నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు ప్రయత్నంలో పాల్గొన్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల విద్యార్థిని ఎం. శ్రీలక్ష్మీ ప్రసన్న అద్భుత ప్రతిభ కనబరిచి విజయవంతంగా పాల్గొనడంతో యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ నుంచి అధికారిక ప్రశంసాపత్రం అందుకోవడం ఆనందకరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల సీఆర్వో కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్స్ స్వప్న, ముస్తఫా, క్యాంపస్ ఇన్‌చార్జ్ విక్టర్ చార్లెస్, ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌చార్జ్ సందీప్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీలక్ష్మీ ప్రసన్నను అభినందించారు.
0 కామెంట్‌లు