ఏజెన్సీ ప్రజల కనీళ్లకు పరిష్కారం చూపాలి. గుండాల ఆసుపత్రి ఘటనపై కల్వకుంట్ల కవిత పరామర్శ

ఏజెన్సీ ప్రజల కనీళ్లకు పరిష్కారం చూపాలి

గుండాల ఆసుపత్రి ఘటనపై కల్వకుంట్ల కవిత పరామర్శ

• చాట్ల వనజ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

• ఏజెన్సీ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకం... మౌలికవసతుల కల్పనకు డిమాండ్

పోడు భూములపై అటవీశాఖ దౌర్జన్యాలు అరికట్టాలని పిలుపు


*గుండాల మండలం జులై 10 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

 ఏజెన్సీ ప్రాంత ప్రజల కష్టాలు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభుని గూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ కుటుంబ సభ్యులను ఆమె గురువారం పరామర్శించారు. నిండు గర్భిణిగా ప్రసవం కోసం గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వనజ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువుతో పాటు మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చోటుచేసుకున్న పరి ణామాలు కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యు లను పరామర్శించిన అనంతరం కవిత మాట్లా డుతూ చాట్ల వనజ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుం దని స్పష్టం చేశారు.

ఏజెన్సీ ఆసుపత్రుల్లో పరిస్థితులు మారాలి

ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివ సించే గిరిజన ప్రజలకు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు, సిబ్బంది నియామకాలు వెంటనే చేపట్టాలని, అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

గుండాల ఆసుపత్రి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. వైద్యం కోసం వచ్చే పేదలు, గిరి జన కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమని, అలాంటి చోట్ల నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే తగిన ఆర్థిక సహాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.

పోడు భూములపై దౌర్జన్యాలు ఆపాలి, గిరిజనుల హక్కులను కాపాడాలి

అనంతరం పోడు భూముల అంశంపై స్పందించిన కవిత... దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని జీవి స్తున్న ఆదివాసీ, గిరిజనుల హక్కులను కాపాడా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సాగులో ఉన్న పోడు భూములపై అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. రీసర్వేల పేరుతో సాగుదారులను వేధించడం నిలిపివేయాలని, అర్హులైన గిరిజన రైతులకు వెంటనే హక్కు పత్రాలు (పట్టాలు) అందించాలని డిమాండ్ చేశారు. పోడు భూములే ఆధారంగా జీవిస్తున్న గిరిజన కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయవద్దని ప్రభు త్వాన్ని హెచ్చరించారు. "అడవిని కాపాడుతూ తర తరాలుగా జీవిస్తున్న ఆదివాసీల హక్కులను గౌర వించాలి. వారి నోటికాడి బువ్వను లాక్కునే చర్య లకు తావివ్వకూడదు" అని కవిత అన్నారు. సాగులో ఉన్న భూములకు శాశ్వత హక్కులు కల్పించి గిరిజన కుటుంబాలకు భరోసా కల్పించా లని కోరారు.

అమరవీరుల స్తూపానికి నివాళులు

గుండాల పర్యటనలో భాగంగా తెలంగాణ అమర వీరుల స్తూపాన్ని సందర్శించిన కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేన జిల్లా అధ్యక్షులు వాసం రామకృష్ణ దొర, వీరన్న తదిత రులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు