బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం.. ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
-గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం.. కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పిలుపు ఇచ్చిన రేగా
అశ్వాపురం: గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శుక్రవారం అశ్వాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రేగా కాంతారావు ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్ఠం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ పెరుగుతోందని, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మారేళ్లపాడు హెడ్‌వర్క్స్ పరిశీలించిన రేగా.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
📍అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని మారేళ్లపాడు హెడ్‌వర్క్స్ పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. 2023లో రూ.25 కోట్లతో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును రైతులకు అందించిన కేసీఆర్ సేవలను కొనియాడుతూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భద్రాద్రి జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వకుండా ముగ్గురు మంత్రులు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక రైతాంగానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
#BRS #RegaKanthaRao #Aswapuram #BhadradriKothagudem #SBNEWS
0 కామెంట్‌లు