ఆదోనిలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు.. విగ్రహానికి నివాళులు
కర్నూలు జిల్లా ఆదోనిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ఊరేగింపుగా బయలుదేరి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్సార్ తన పాలనలో ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి, అడ్వకేట్ ఎల్.కె. జీవన్ సింగ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లోకేశ్వర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు