అంబేద్కర్ ప్రజా భవన్‌లో టౌన్ బీఎల్‌ఏల సమావేశం నిర్వహణ

అంబేద్కర్ ప్రజా భవన్‌లో టౌన్ బీఎల్‌ఏల సమావేశం నిర్వహణ
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజా భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖాదర్ పాషా అధ్యక్షతన టౌన్ బీఎల్‌ఏల సమావేశం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి వార్డులో ఎస్‌ఐఆర్  ఫారాలను ఓటర్లకు అందజేశారు 
 వాటిని సక్రమంగా నింపించి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు సూచించారు.ఈ సమావేశంలో గోపాల్ రెడ్డి, రజిత మల్లేష్, రఘురాం, గౌరీ శంకర్, విష్ణు చంద్రశేఖర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు