బయ్యారం ఇనుపరాతి గుట్టలను పరిశీలించిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత

బయ్యారం ఇనుపరాతి గుట్టలను పరిశీలించిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఇనుపరాతి గుట్టలను టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బయ్యారం ఉక్కు మన తెలంగాణది, అదే సమయంలో ఆదివాసీల హక్కు  అన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆ కలను సాకారం చేయలేదని ఆమె విమర్శించారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా బయ్యారం ఇనుప ఖనిజాన్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.అవసరమైతే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఐరన్ పరిశ్రమలతో అనుసంధానం చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగాలు లభించడంతో పాటు సింగరేణి సంస్థకూ ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా తమ వంతు కృషి చేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు