అకాల వర్షానికి బురదమయమైన తురుబాక గ్రామం. బురదలో వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.
గుండాల మండలం జులై 8 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
గుండాల మండలం ముత్తాపురం గ్రామపంచాయితీ పరిధిలో గల తురుబాక గ్రామం లొ మంగళవారం ప్రజలు ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ ఆధ్వర్యంలో బురదలో వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు,ఈ నిరసన కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తి రాధా, ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనెం రమణబాబు పాల్గొని మాట్లాడుతూ, దాదాపుగా తరుబాక రెవెన్యూ గ్రామంగా గుర్తించి శతాబ్ద కాలం కావస్తున్న నేటికీ అ గ్రామాన్ని అభిరవృద్ది పదంలో గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం, వర్షం పడితే గ్రామంలో రోడ్డుపై నడిచే పరిస్థితి లేదు కనీసం మట్టి రోడ్డు అయినా మంజూరు చేయని పరిస్థితి ఓట్ల కోసం వచ్చి గ్రామాలలో వాగ్దానాలు చెప్పి హామీలు ఇచ్చి వెళ్లడమే తప్ప మరల తిరిగి చుసిన రోజులు లేవని వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి ఉన్నారని, కనీసం వర్ష కాలంలో పిల్లలు బడికి వెళ్లాలంటే బురదలో ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తుందని, త్వరలో *ముత్తాపురం గ్రామపంచాయతీ నుండి గుండాల తాసిల్దార్ కార్యాలయం వరకి* *పాదయాత్ర మహాధర్నాను ఏర్పాటు చేస్తామని* ప్రజలు మహాధర్నాకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు, అనంతరం తురుబాక గ్రామ రైతు యదలపల్లి వసంత రావు మాట్లాడుతూ, పినపాక శాసనసభ సభ్యులు కాంగ్రెస్ సర్పంచ్ లని గుర్తించి అ యెక్క పంచాయితీలకే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం చాలా బాధాకరమని, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని,వేరే పార్టీ సర్పంచ్ లు గెలిచినాచోట సవతి ప్రేమ చూపించడం చాలా బాధకరమన్నారు, తన సొంత నియోజకవర్గంలోని ప్రజలను రెండు విధాలుగా చూడడం అనేది చాలా విడ్డూరంగా ఉందన్నారు, ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ గుండాల మండల కార్యదర్శి గోగ్గేలా సుధాకర్,గ్రామ పెద్ద రైతు ఎదలపల్లి కృష్ణ,సనప రాజు, నరసయ్య, జోగా వినోద, వేప కౌసల్య, ప్రమీల, అన్నపూర్ణ, గోగ్గేలా ఆదినారాయణ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు