వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఆదోని: దివంగత మాజీ ముఖ్యమంత్రి 77వ జయంతి సందర్భంగా ఆదోనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్సార్ తన పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. అలాగే తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన నాయకులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజల తీర్పును ఎదుర్కొంటుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎల్.కె. జీవన్ సింగ్ (అడ్వకేట్), మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లోకేశ్వర్ అమ్మతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– స్వతంత్ర భారత్ రిపోర్టర్, స్వామి దాసు, 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు