రైతు భరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

రైతు భరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
అమ్రాబాద్: ఖరీఫ్ సీజన్‌కు ఎకరాకు రూ.6,000 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా అమ్రాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన కు, అలాగే కు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతు భరోసా నిధులను విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, NSUI నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు