అరుణోదయ సాంస్కృతికొద్యమ సేనాని కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు.

అరుణోదయ సాంస్కృతికొద్యమ సేనాని కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు.

కామ్రేడ్ నాగన్నకు మరణం లేదు పాట రూపంలో ప్రజల మధ్యన ఉంటాడు:

జులై 11న ఇల్లెందు లో జరిగే కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ.


*గుండాల మండలం జులై 11 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

అమరుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న మరణం లేదని ఆయన ప్రజల మధ్య ఎప్పుడు పాట రూపంలో ఉంటాడని *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గుండాల మండల కార్యదర్శి కోరం సీతారాములు ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు గడ్డం లాలయ్య లు  అన్నారు.*
ఈరోజు గుండాల సెంటర్లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు  కామ్రేడ్ యాసారపు ఎంకన్న  అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా రాజారం గ్రామంలో జన్మించిన కామ్రేడ్ పరకాల నాగన్న అరుణోదయ నాగన్న గా గోదావరి లోయ పరిహాక ప్రాంతమంతా విస్తరించి పేరుగాంచాడని ఆయన అన్నారు. పేద కుటుంబంలో పుట్టి పాలేరు జీవితం నుండి కానూరీ పాటలతో ముగ్ధుడైన కామ్రేడ్ నాగన్న పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా ఎదిగి బడుగు బలహీన వర్గాల కోసం భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అమరవీరుల పాటలని పాడుతూ ప్రజా సమస్యలపై నాటికలు చేస్తు, జానపద గేయాలు ఆలపిస్తూ ఒక ఉన్నత శిఖరానికి ఎదిగాడని ఆయన అన్నారు. కామ్రేడ్ నాగన్న కి చదువు రాకపోయినా పాటలు పాడి వినిపించినాక గుర్తు పెట్టుకొని చూడకుండా ఆడేవాడు సొంతంగా కూడా కొన్ని పాటలు రాసేవాడు అందుకే ఆయన ఏకసంతాగ్రహి అని ఆయన అన్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్ని కలోబాలకు గురిచేసిన పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడుతూ నిరాడంబర జీవితాన్ని గడిపిన వ్యక్తిగా ఆయన జీవితం గడిచిందని ఎందరికో ఆదర్శంగా నిలిచాడని వారు అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ అరుణోదయ నాగన్న అంటే తెలవని వారు లేరు. ఎంతోమంది అమరవీరుల పాటలను ఆలపించి వారి రూపాన్ని పాట రూపంలో కళ్ళ ముందు నిలబెట్టిన చరిత్ర కామ్రేడ్ నాగన్నది అని ఆయన కొనియాడారు. కామ్రేడ్ నాగన్న నాగన్న మరణించిన ఆయన పాడిన పాటలు ప్రజల రూపంలో చలణంలో నిత్యం ఉంటాయని ఆయన పోరాటాల వెలుగులో ఆయన ఆశయాల సాధనలో పోరాడాలని అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని వారన్నారు.ఈనెల 11న ఇల్లెందులో జరిగే కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్, ఈసం కృష్ణ, శేఖర్, మోకాల సూర్యనారాయణ, తాటి రమేష్, ప్రమోదు, గడ్డం నగేష్, గడ్డం కృష్ణ, గోగ్గల శ్రీను, మెంతినీ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు