ములుగు, జూలై 2 (ఎస్‌బి న్యూస్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఒకేసారి 9 పాడి గేదెలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల సమాచారం ప్రకారం, గ్రామ శివారులో మేత మేస్తున్న గేదెలు తెగిపడి నేలపై ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ ప్రవాహానికి గురైన గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనతో గేదెల యజమాని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పాడి పశువులే జీవనాధారంగా ఉన్న కుటుంబాలకు ఈ ఘటన భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
0 కామెంట్‌లు