అక్రమ అరెస్టును ఖండించిన టీఆర్ఎస్ అనుబంధ ఆదివాసీ సంఘం

అక్రమ అరెస్టును ఖండించిన టీఆర్ఎస్ అనుబంధ ఆదివాసీ సంఘం

గుండాల మండలం జులై 3 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి


తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఉప్పల్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ ఆదివాసీ సంఘం నాయకుడు కోరం గణేష్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో ఈ హామీని పలుమార్లు ప్రకటించారని అన్నారు.

అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాల పంపిణీ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఈ హామీల అమలు కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు ఈ అరెస్టులను ఖండించి, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరం గణేష్ విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు