పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్
నాగర్‌కర్నూల్, జూలై 2 (ఎస్‌బి న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 11 మందిని అరెస్ట్ చేశారు.

గురువారం సాయంత్రం గ్రామంలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.

నిందితుల వద్ద నుంచి రూ.17,270 నగదు, 6 మోటార్‌సైకిళ్లు, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్ గోవర్ధన్ తెలిపారు.

పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు