రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అశోక్‌నగర్‌లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలోని ముత్యాలమ్మ గుడి వద్ద రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మణుగూరు పట్టణంలోని ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ సీసీ రోడ్డు పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు