పినపాక : రైతు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పినపాక మండలం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎరువుల పంపిణీలో యాప్ విధానాన్ని రద్దు చేసి సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని కోరారు. రైతులు పండించే అన్ని రకాల ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేసి, కొనుగోలు ఆంక్షలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు నిధులను అన్ని ఎకరాలకు వర్తింపజేసి, రైతుభీమా ప్రీమియాన్ని పూర్తిస్థాయిలో చెల్లించి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సీనియర్ నాయకులు వాసు బాబు, పోలిశెట్టి సత్తిబాబు, బత్తుల వెంకటరెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు