పినపాక మండలంలో నాటు సారాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం - ఏడుగురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన అధికారులు


పినపాక మండల వ్యాప్తంగా అక్రమంగా నాటు సారా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటు సారా విక్రయిస్తున్న ఏడుగురిని గుర్తించి అదుపులోకి తీసుకుని శనివారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఎదుట బైండోవర్ చేశారు.

అక్రమ మద్యం విక్రయాలు, తయారీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రజల ఆరోగ్యానికి హానికరమైన నాటు సారా వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు హెచ్చరించారు. మండల పరిధిలో నాటు సారా తయారీ, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.

ప్రజలు కూడా అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం అందించి ఎక్సైజ్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు