గుండాల పీహెచ్‌సీపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

గుండాల పీహెచ్‌సీపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
గుండాల: బాలింత చాట్ల వనజ మృతి ఘటనపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వైద్యాధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వైద్య బృందాన్ని ఎమ్మెల్యే హెచ్చరించారు. #Gundala #Pinapaka #PayaVenkateswarlu #VanajaCase

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు