జాతీయ లోక్ అదాలత్‌లో 147 కేసుల పరిష్కారం: జడ్జి సూరిరెడ్డి

జాతీయ లోక్ అదాలత్‌లో 147 కేసుల పరిష్కారం: జడ్జి సూరిరెడ్డి
మణుగూరు న్యాయస్థానం పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 147 కేసులు పరిష్కారమయ్యాయని జడ్జి కంబపు సూరిరెడ్డి తెలిపారు. 94 పోలీసు కేసులు, 2 చెక్ బౌన్స్ కేసులు ముగిశాయి. 52 కేసుల్లో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రూ.1.15 లక్షల జరిమానా విధించారు. 385 పెట్టి కేసుల్లో రూ.2.16 లక్షలు, 213 ఈ-పెట్టి కేసుల్లో రూ.24,700 జరిమానా వసూలైంది. అలాగే 55 బ్యాంకు వివాద కేసుల్లో రూ.30.27 లక్షలు చెల్లింపుతో పరిష్కారం లభించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు