ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ఉప సర్పంచ్ గాండ్ల సురేష్

ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ 
మణుగూరు, జూన్ 21 (ఎస్‌బీ న్యూస్): ప్రపంచ యోగా దినోత్సవం-2026 సందర్భంగా మణుగూరు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌లో సచిన్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాండ్ల సురేష్ మాట్లాడుతూ, యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు యోగాకు కేటాయించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని తెలిపారు. యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, శరీరం దృఢంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

"యోగా చేద్దాం.. ఆరోగ్యంగా ఉందాం" అనే నినాదంతో ప్రజలందరూ యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సచిన్ వాకర్స్ క్లబ్ సభ్యులు, యోగా సాధకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు