గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు కీలక వేదికలని, వాటి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని పినపాక ఎంపీడీవో సంకీర్త్, ఎంపీఓ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఈ బయ్యారం, గడ్డంపల్లి, పొట్లపల్లి, మల్లారం, భూపాలపట్నం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయా సర్పంచ్ ల అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభల్లో మాట్లాడారు.గ్రామ ప్రజల సమస్యలు, అవసరాలు గ్రామసభల ద్వారానే అధికారుల దృష్టికి వస్తాయని, వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనుల పురోగతి, ప్రజల అభిప్రాయాల సేకరణలో గ్రామసభలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ప్రజలు గ్రామసభల్లో చురుకుగా పాల్గొని తమ సమస్యలను నిర్భయంగా వెల్లడించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, గ్రామాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ గ్రామ సభల్లో తాసిల్దార్ శ్రీనివాసరెడ్డి , వెటర్నరీ వైద్యులు ఉజ్వల, అగ్రికల్చర్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ, తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ తమ శాఖల పరిధిలో ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. అలాగే సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ చందర్రావు, పొట్లపల్లి సర్పంచ్ సమ్మయ్య, గడ్డంపల్లి సర్పంచ్ కృష్ణవేణి, భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, మల్లారం సర్పంచ్ సాంబశివరావు, ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు