ప్రమాదకర కల్వర్టు సమస్యకు శాశ్వత పరిష్కారం.. నిర్మాణ పనులు ప్రారంభం

ప్రమాదకర కల్వర్టు సమస్యకు శాశ్వత పరిష్కారం.. నిర్మాణ పనులు ప్రారంభం
ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 7వ వార్డులో ప్రజలను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ప్రమాదకర కల్వర్టు సమస్యకు పరిష్కారం లభించింది. పూర్తిగా ధ్వంసమైన కల్వర్టు కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాలు ఏర్పడుతున్నాయని స్థానికులు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురాగా, సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు వెంటనే స్పందించారు. ప్రజల భద్రత దృష్ట్యా నూతన కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కూనూరు అశోక్ గౌడ్, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, ఎండి ఖాజా పాషా, ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు