పినపాక మండల రైతులకు అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఉచితంగా అందించడంతో పాటు నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల నాయకుడు చెట్టుపెల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం పినపాక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి పినపాక తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రైతులు అధిక వ్యయంతో పంటలు పండించినా గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలు అమలు చేయాలని, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బట్ట అనసూర్య, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు