మణుగూరులో జాతీయ మానవ హక్కులు-ఆర్టీఐ కౌన్సిల్ నూతన కార్యాలయం ప్రారంభం

మణుగూరులో జాతీయ మానవ హక్కులు-ఆర్టీఐ కౌన్సిల్ నూతన కార్యాలయం ప్రారంభం
మణుగూరు, జూన్ 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ మానవ హక్కులు-ఆర్టీఐ కౌన్సిల్ నూతన కార్యాలయాన్ని మణుగూరు మండలం చిక్కుడు గుంట గ్రామంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదురుగా శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్ట్ సంఘం నాయకుల చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభింపజేశారు. అనంతరం మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందిస్తున్న పలువురిని శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల హక్కుల పరిరక్షణ, సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, బాధితులకు న్యాయం అందించడంలో జాతీయ మానవ హక్కులు-ఆర్టీఐ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మానవ హక్కులపై అవగాహన పెంచడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.
ప్రజల హక్కులకు భంగం కలిగిన సందర్భాల్లో బాధితులకు చట్టపరమైన సహాయం అందించడంతో పాటు, సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొనేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు బందా సతీష్ , కట్ల ప్రణయ్ కుమార్, కుంజ గణేష్, కాసినేడి బలరామకృష్ణ,సూరే పల్లి ధనుంజయరావు,ప్రవీన్, జర్నలిస్ట్ లు బిల్లా నాగేందర్, శ్రీరామ్ బృహస్పతి, సాంబశివరావు, సాయి ప్రవీణ్, పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు