-స్వర్గీయ జలగం వెంగళరావుకు ఘన నివాళి
సారపాక:ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతికి విశేష కృషి చేసి, సారపాకలో ఐటీసీ పేపర్ బోర్డ్స్ పరిశ్రమ స్థాపనకు కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ సర్దార్ జలగం వెంగళరావు 27వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని జలగం వెంగళరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జలగం వెంగళరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సారపాకలో ఐటీసీ పేపర్ బోర్డ్స్ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జలగం వెంగళరావు సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వారాల వేణు మాట్లాడుతూ జలగం వెంగళరావు ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు