పినపాక:పొట్లపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–99 డేస్ ప్లాన్ గ్రామసభలో ఇతర అధికారులతో కలిసి సీఐ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా పోస్టల్, ఎస్‌బీఐ తదితర సంస్థల్లో తక్కువ వార్షిక చందాతో లభించే ప్రమాద బీమా పాలసీలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దకు ఏదైనా ప్రమాదం జరిగితే అతనిపై ఆధారపడిన పిల్లలు, వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఇటువంటి బీమా పథకాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామస్థులు బీమా పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో మరణించడం అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడటం అని తెలిపారు.
0 కామెంట్‌లు