ఇకపై ‘నో ఫ్రెండ్లీ పోలీసింగ్’: డీజీపీ సీవీ ఆనంద్

ఇకపై ‘నో ఫ్రెండ్లీ పోలీసింగ్’: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణలో ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ కంటే చట్ట అమలుకు ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలను గౌరవిస్తామని, అయితే రౌడీలు, గుండాల పట్ల ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.

తెలంగాణలో మావోయిజం ప్రభావం పూర్తిగా అంతమైందని పేర్కొన్న ఆయన, గ్రేహౌండ్స్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ సుమారు 1,700 మంది సిబ్బందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించిన డీజీపీ, ప్రస్తుతం సైబర్ నేరాలు పోలీసు శాఖకు పెద్ద సవాల్‌గా మారాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు