38 మంది లబ్ధిదారులకు రూ.38.42 లక్షల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

అశ్వాపురం మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 38 మంది లబ్ధిదారులకు రూ.38,42,408 విలువైన చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, హౌసింగ్ ఏఈ ఉదయ్‌కుమార్, ఆర్‌ఐ లీలావతి, కేశవరెడ్డి, రమేష్‌బాబు, ఊస అనిల్, వేములపల్లి రమేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు