ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా పై స్పష్టత ఇవ్వండి - గ్రామ సభలో తాసిల్దార్, ఎంపీడీవో ను అడిగిన స్థానిక కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక మంజూరు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి తాసిల్దార్, ఎంపీడీవోను కోరారు. పినపాక మండలం ఈ బయ్యారంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం అని బురద తగ్గించడానికి అక్కడక్కడ ఇసుక సైతం పోయాల్సి ఉంటుందని గ్రామ అవసరాల కోసమైనా ఇసుకకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ సంకీర్త్, ఎంపీ ఓ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యను తెలియజేశామని త్వరలోనే జిల్లా కలెక్టర్ నిర్ణయానుసారం పర్మిషన్ ఇస్తామని తెలిపారు. ఇసుక ఎంత అవసరమో అధికారులతో ఇప్పటికే నివేదికలు తెచ్చుకున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు