ఆధారాలతో వస్తాం.. బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధమా..? జానంపేటలో అవినీతి ఎవరిదో ప్రజలకు తెలుసు...

దొంగలే దొంగ అంటే ఎవరు నమ్ముతారు..? బహిరంగ చర్చకు సిద్ధమా..?
- కాంగ్రెస్ నాయకులు సవాల్
పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో అక్రమాలు జరిగాయని కొందరు బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్థానిక సర్పంచ్ ఉమామహేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేరం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక మండలం జానంపేట గ్రామంలో ఉపసర్పంచ్ కిషోర్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అవినీతికి చిరునామాగా నిలిచిన వారే నేడు నీతులు చెప్పడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్, 2026 పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే గత పాలనపై వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసిందన్నారు. గతంలో గ్రామపంచాయతీలో జరిగిన వ్యవహారాలు, ఖర్చులు, తీర్మానాలు, గ్రామసభల నిర్వహణ తీరుపై ప్రజలకు పూర్తి అవగాహన ఉంద
ని,తమ పాలనలో ప్రతి రూపాయి ఖర్చును గ్రామసభలో ప్రజలకు వెల్లడిస్తున్నాం అని తెలిపారు.పారదర్శకతతో ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు. గతంలో జరిగిన ఖర్చులు, డీజిల్ వినియోగం, విద్యుత్ బిల్లులు, టైర్ల మార్పిడి, ఇతర అభివృద్ధి పనులపై పూర్తి ఆధారాలతో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు.అందువల్ల గత పాలనలో జరిగిన అభివృద్ధి, ఖర్చులు, బిల్లులు, తీర్మాన పుస్తకాలు, అన్ని ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాం. తేదీ, స్థలం మీరే నిర్ణయించండి. మేము అన్ని ఆధారాలతో ప్రజల ముందుకు వస్తాం అని ఈ సందర్భంగా ఆ సర్పంచ్ తెలిపారు.ప్రజాపాలన జరుగుతుంటే ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చారని ఇకనైనా వాస్తవాలను అంగీకరించి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడం మంచిదన్నారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు