పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఎం.పి.యు.పి.ఎస్ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులను మండల విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్య, స్థానిక సర్పంచ్ చందర్రావు తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా విద్యార్థుల్లో అభ్యాస నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, గ్రామ సర్పంచ్ చంద్రరావు
ఉపసర్పంచ్ సందీప్, గ్రామ పెద్ద వెంకటరెడ్డి, పాఠశాల ఏఏపీసీ వైస్ చైర్‌పర్సన్, ఐఈఆర్‌పీ, పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్‌స్ట్రక్టర్, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.#Pinapaka #Pothureddipally #MPUPS #PrePrimary #MEOKNagayya #Education #SchoolNews #SBNEWS #BhadradriKothagudem #TelanganaNews
0 కామెంట్‌లు