అమ్రాబాద్ మండలం హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై మన్ననూర్ దర్గా సమీపంలో జీపు బ్రేకులు ఫెయిల్ కావడంతో చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించారు. తాను అందుబాటులో లేకపోయినా ఆసుపత్రి వైద్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు.
ప్రజా ప్రతినిధిగా బాధితుల పట్ల మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ చర్యలను స్థానికులు అభినందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి, వారి ప్రాణాలను కాపాడేందుకు వెంటనే స్పందించడం ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధతను చాటిందని పేర్కొన్నారు.
👉 ఆపదలో అండగా ఎమ్మెల్యే వంశీకృష్ణ
👉 ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు
👉 మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
#Achampet #VamshiKrishna #Amrabad #RoadAccident #PublicService #TelanganaNews #SBNEWS
0 కామెంట్‌లు