ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

అచంపేట మండల పరిధిలోని అనంతవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతవరం గ్రామానికి చెందిన మిట్టకడుపుల శ్రీనివాసులు (49), అదే గ్రామానికి చెందిన ఆర్కాపల్లి వెంకటయ్యతో కలిసి ఎక్స్‌ఎల్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన అతినారపు వెంకటయ్య, డ్యాగ తిరుపతయ్య ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసులకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు