మణుగూరులో ముగిసిన పీర్ల పండుగ వేడుకలు.. భక్తుల సందడితో గాంధీబొమ్మ సెంటర్ కళకళ


మణుగూరులో ముగిసిన పీర్ల పండుగ వేడుకలు.. భక్తుల సందడితో గాంధీబొమ్మ సెంటర్ కళకళ
మణుగూరులో మొహరం సందర్భంగా నిర్వహించిన పీర్ల పండుగ వేడుకలు శనివారంతో ఘనంగా ముగిశాయి. గాంధీబొమ్మ సెంటర్‌లో కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పీర్ల ఊరేగింపు నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. నేటితో ఈ ఏడాది మొహరం పీర్ల పండుగ వేడుకలు ముగిశాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు