మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన

మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మణుగూరు, జూన్ 29: మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై రోగులు, వారి బంధువులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు