వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
మణుగూరు, జూన్ 29: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని వెంటనే రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు.
సోమవారం మణుగూరులో నిర్వహించిన సిపిఎం పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులకు ఉపాధి హామీ చట్టం జీవనాధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని బలహీనపరిచే లేదా ప్రత్యామ్నాయ చట్టాలతో ప్రజల హక్కులను హరించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.
గ్రామీణ ప్రజలకు కనీస ఉపాధి హక్కును పరిరక్షించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని, కూలీలకు తగిన పనిదినాలు, సమయానికి వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు